తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తరలిస్తున్న నిందితుడు అరెస్ట్ - అమ్మోనియం నైట్రేట్ తరలించిన ప్రధాన నిందితుడు అరెస్టు

యాదాద్రిలో అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్​లోని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపి నారాయణరెడ్డి వెల్లడించారు.

Arrested for moving ammonium nitrate illegally in yadadri district
అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తరలిస్తున్న నిందితుడు అరెస్ట్

By

Published : Feb 18, 2020, 10:31 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం ఎస్వోటీ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న అమ్మోనియం నైట్రేట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన చీరిక బుచ్చిరెడ్డిని హైదరాబాద్​ ఉప్పల్​లోని తన నివాసంలో అరెస్ట్ చేసినట్లు జిల్లా డీసీపి నారాయణ రెడ్డి వెల్లడించారు.

అమ్మోనియం నైట్రేట్ బస్తాలను తరలిస్తున్న నిందితుడు అరెస్ట్

ఘటన జరిగిన రోజు నిందితులు గడ్డం కొండల్ రెడ్డి, బత్తుల నరేశ్​ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారిని ఇప్పటికే కోర్టులో హాజరు పరచి, రిమాండ్​కి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసును చేధించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని డీసీపి నారాయణ రెడ్డి అభినందించారు.

ఇవీ చూడండి:అర్హులను తొలగించి.. అనర్హులకు కేటాయించారు..

ABOUT THE AUTHOR

...view details