ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7.30 గంటలకు కొండకింద జరగనున్న వైభవోత్సవ కల్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకింద పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బారికేడ్లు అమర్చారు. వివిధ రూపాలతో ఉన్న విద్యుద్దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణమండపం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వామి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించే విధంగా ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నారు.
ఇవాళ యాదాద్రిలో లక్ష్మీ నారసింహుని కల్యాణోత్సవం.. - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
సోమవారం జరిగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉదయం బాలాలయంలో కల్యాణ వేడుక నిర్వహించనున్నారు. భక్తుల కోసం సాయంత్రం కొండ కింద కల్యాణం చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున ఈ వేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా కొండకింద జడ్పీ పాఠశాలలో జరపనున్నారు.
![ఇవాళ యాదాద్రిలో లక్ష్మీ నారసింహుని కల్యాణోత్సవం.. arrangements-started-for-srilakshmi-narasimha-swamy-kalyanam-in-yadadri-temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11101383-thumbnail-3x2-ydadri-f---copy.jpg)
రేపే యాదాద్రీశుని వైభవోత్సవ కల్యాణం.. ఏర్పాట్లు ప్రారంభం!
ఈ నెల15న ప్రారంభమైన యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు 25న ముగియనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామివారి కల్యాణ మహోత్సవం ఉదయం కొండపైన బాలాలయంలో నిర్వహిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున భక్తులు వీక్షించేలా కొండకింద జరపనున్నారు.
ఇదీ చదవండి:యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి 2గంటలు
Last Updated : Mar 22, 2021, 12:09 AM IST