సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపటి యాదాద్రి (yadadri temple) పర్యటన కోసం.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దర్శనంతో పాటు వసతికి సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొండపై ఈవో కార్యాలయం, వసతిగృహాల్లో... ప్రముఖులు బస చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
Yadadri: యాదాద్రిలో సీజేఐ పర్యటనకు అధికారుల ఏర్పాట్లు - తెలంగాణ వార్తలు
యాదాద్రిలో సీజేఐ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపై ఈవో కార్యాలయం, వసతిగృహాల్లో... ప్రముఖులు బస చేసేలా సన్నాహాలు చేశారు. ఇప్పటికే భవనాల్లో లైటింగ్, సెంట్రల్ ఏసీ, లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
యాదాద్రిలో సీజేఐ పర్యటనకు అధికారుల ఏర్పాట్లు
ఇప్పటికే భవనాల్లో లైటింగ్, సెంట్రల్ ఏసీ, లిఫ్ట్ సౌకర్యం వంటి వసతులు కల్పించారు. బాలాలయాన్ని మామిడి, అరటి తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డును శుభ్రం చేసే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు ఆలయ నగరిలోపెద్దగుట్టపై 2 హెలిపాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మిషన్ యూపీ: సరికొత్తగా భాజపా 'సోషల్ ఇంజినీరింగ్'