తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో  దర్శనాలకు ప్రత్యేక వరుసలు - యాదాద్రి ఆలయం వార్తలు

యాదాద్రి పుణ్య క్షేత్రంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్వామి వారి దర్శనం సమయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక వరుసల బాక్స్​లను ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్​ ఆనందసాయి పర్యవేక్షణలో వాటిని రూపొందిస్తున్నారు.

Arrangement of darshan row boxes in Yadadri temple
యాదాద్రి ఆలయంలో దర్శన వరసల బాక్స్‌ల ఏర్పాటు

By

Published : Feb 28, 2021, 9:37 AM IST

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ప్రత్యేక వరసల బాక్స్‌ల ఏర్పాటుకు యాడా నడుం బిగించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అల్యూమినియం, ఇత్తడి లోహంతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి పర్యవేక్షణలో వాటిని రూపొందించారు.

ఆలయంలో భక్తిభావాన్ని పెంపొందించే తరహాలో వైష్ణవత్వం ఉట్టిపడేలా శంఖం.. విష్ణుచక్రం.. తిరునామంతోపాటు జయ, విజయుల రూపాలను పొందుపరిచారు. ఉజ్జయినీ అమ్మవారి ఆలయం, గుజరాత్‌లోని స్వామి నారాయణ్‌ మందిరంలో ఇలాంటి బాక్స్‌లు ఉన్నాయని, పనులను పర్యవేక్షిస్తున్న ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి తెలిపారు.

ఇదీ చదవండి:భూ సమస్యలతో రైతులు సతమతం.. అందని సంక్షేమం

ABOUT THE AUTHOR

...view details