తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ కారణజన్ముడు.. స్వామివారే ఆయన చేత గుడి కట్టించుకుంటున్నారు' - MLA Roja about yadadri

MLA Roja Yadadri Visit: ఏపీ ఎమ్మెల్యే రోజా యాదాద్రిని సందర్శించారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న రోజా.. నూతనంగా నిర్మితమవుతున్న ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కట్టడాలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవట్లేదని.. స్వామివారే సీఎం కేసీఆర్​ చేత గొప్పగా గుడి కట్టించుకుంటున్నారని ప్రశంసించారు.

AP MLA Roja visited yadadri temple and praised CM KCR
AP MLA Roja visited yadadri temple and praised CM KCR

By

Published : Feb 12, 2022, 4:17 PM IST

MLA Roja Yadadri Visit: భీష్మ ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారిని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం నూతనంగా నిర్మితమవుతోన్న ఆలయాన్ని కలియతిరిగి పరిశీలించారు. ఉట్టిపడుతోన్న శిల్పకళను చూసి పవరశించింపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆలయాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవట్లేదని హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు సీఎం కేసీఆర్​.. కారణజన్ముడని కితాబిచ్చారు.

యాదాద్రి ఆలయ కట్టడాన్ని చూసి పరవశిస్తోన్న రోజా..

"ఈ కాలంలో అద్భుతమైన రాతి కట్టడాలతో.. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా యాదాద్రి దేవాలయం రూపుదిద్దుకోవడాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో పవర్​ఫుల్​ దేవుడైన లక్ష్మీనరసింహ స్వామికి ఇంత గొప్ప గుడి కట్టించే అదృష్టం దక్కిందంటే.. సీఎం కేసీఆర్ నిజంగా కారణ జన్ముడే. ఆయన చేత స్వామివారే ఇంత గొప్పగా గుడి కట్టించుకుంటున్నారు. ఇది నిజంగా స్వామి వారి ఆశీర్వాదం. ఆయనతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరిపై యాదాద్రీశుడి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా." - రోజా, ఏపీ ఎమ్మెల్యే

'సీఎం కేసీఆర్​ కారణజన్ముడు.. స్వామివారే ఆయన చేత గుడి కట్టించుకుంటున్నారు'

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details