యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ధగధగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం, 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు జరపనున్నారు.
యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు - Telangana news
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం, 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు జరపనున్నారు.

యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
రథం ఊరేగింపు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్రలో ఐదవసారి రథోత్సవ తంతును కొండ కింద నిర్వహిస్తుండటం వల్ల పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి:ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది శూన్యం: కేటీఆర్