ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవ నిర్వహిస్తున్నారు.
జగన్మోహిని అవతారంలో నారసింహుడు - telangana latest news
యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. స్వామివారు రోజుకో అవతారంలో కనువిందు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జగన్మోహిని అవతారంలో నారసింహుడు
ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన నేడు స్వామివారు జగన్మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని వజ్ర వైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ బాలాలయంలో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి సేవ వద్ద అర్చకులు జగన్మోహిని అవతార విశిష్టతను భక్తులకు వివరించారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో సింహవాహనంపై కనువిందు చేసిన నారసింహుడు