యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చేతికి గాయమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడం, మంచంపై నిద్రిస్తున్న ఫార్మసిస్ట్‌ను మందులు ఇవ్వాలని కోరారు. మత్తులో ఉన్న ఫార్మసిస్ట్ దురుసుగా ప్రవర్తించారని బాధితులు చెబుతున్నాడు. ఈ విషయమై వైద్య అధికారి నరేష్ కుమార్‌ను వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని, ఫార్మసిస్ట్ శివ కుమార్ 104 వాహనంలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. శివకుమార్‌పై DM & HOకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మత్తులో ఫార్మసిస్ట్.. రోగులతో రచ్చ రచ్చ.. - A man from Dharamaram village of Addagudur mandal
హాస్పిటల్‌కు వచ్చిన రోగులపై మద్యం మత్తులో ఉన్న ఫార్మసిస్ట్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది.
మత్తులో ఫార్మసిస్ట్.. రోగులతో రచ్చ రచ్చ..