యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయంలో ఆండాలమ్మ ఊంజల్ సేవా ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే వేకువజామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులను పూజించిన పూజారులు బాలాలయంలో ఆర్జిత పూజలను చేపట్టారు. ఉత్సవ మూర్తులకు పాలాభిషేకం చేసి దర్శన మూర్తులకు స్వర్ణ పుష్పాలతో అర్పించారు.
యాదాద్రి ఆలయంలో ఘనంగా ఊంజల్ సేవా ఉత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో ఆండాలమ్మ ఊంజల్ సేవా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వేకువజామునే సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.
యాదాద్రి ఆలయంలో ఘనంగా ఊంజల్ సేవా ఉత్సవం
సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఉంజల్ సేవా ఉత్సవాన్ని చేపట్టారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి, సుమారు ఒక గంట పాటు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి సమర్పించారు. అంతకు ముందు అమ్మవారి సేవను బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక మంగళ హారతులతో అమ్మవారికి పూజలు చేశారు.