యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని పాతగుట్ట సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో మృతదేహం పడి ఉండటం స్థానికులు చూసి 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు.
యాదగిరిగుట్టలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - గుర్తుతెలియని మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట పాతగుట్ట సమీపంలోని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటన స్థలంలో ఒక వాటర్ బాటిల్, పురుగుల మందు సీసాను పోలీసులు గుర్తించారు. హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యాదగిరిగుట్టలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
మృతుడికి 50 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు గుర్తించారు. సంఘటన స్థలం వద్ద ఒక వాటర్ బాటిల్, పురుగుల మందు సీసాను పోలీసులు గుర్తించారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.