తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు: ప్రభుత్వ విప్​ - ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత

ఆలేరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతామని ప్రభుత్వ విప్,​ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. గంధమల్ల జలాశయం నిర్మాణాన్ని రద్దు చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని ఆమె తెలిపారు. సీజనల్​ వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Alleru MLA gongidi Sunitha Attend Atmakur(M) Mandal general Meeting
ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు: ఎమ్మెల్యే

By

Published : Jun 11, 2020, 10:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గంధమల్ల జలాశయం నిర్మాణాన్ని రద్దు చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కోరారు. రైతుబంధు రాని రైతులు ఈ నెల 13 లోపు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు పత్రాలతో ఏఈఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

కరోనా వైరస్​ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలను గోదావరి జలాలలో నింపుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details