యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వలస కూలీలు, పేద కూలీలను ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. లాక్డౌన్ వల్ల వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, దినసరి కూలీలు, అడ్డ కూలీలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
కార్మికులను ఆదుకోవాలని తహశీల్దార్‌కు వినతి - యాదాద్రి జిల్లా వార్తలు
లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు, దినసరి కూలీలను ఆదుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల తహశీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చారు. లాక్డౌన్ వల్ల ఇక్కడే ఇరుక్కుపోయిన వలస కార్మికులకు వసతి కల్పించాలని కోరారు.
కార్మికులను ఆదుకోవాలని తహశీల్దార్‌కు వినతిపత్రం
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు చాలామంది ఇక్కడే ఉండిపోయారని.. పని లేక.. చేతిలో డబ్బులు లేక తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జాబ్‌కార్డ్ లేక.. ఉపాధి పనులకు కూడా వెళ్లలేక పోతున్నారని.. వారి సమస్యలు గుర్తించి కనీసం జాబ్ కార్డు ఇచ్చినా.. ఉపాధి పనికి వెళ్లి పొట్ట పోసుకుంటారని ప్రజా సంఘాల నేతలు తహశీల్దార్‌ను కోరారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి