యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో రూ.80 లక్షల మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఓపెన్ జిమ్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకారం అందిస్తా: ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకారం అందిస్తా: ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట అభివృద్ధికి మున్సిపల్ పాలక వర్గం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: ఎర్రబెల్లి సవాల్: వరంగల్ నగరానికి ఎవరేం చేశారో తేల్చుకుందాం..