ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ను ఆమె ప్రారంభించారు.
'మండలాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా' - మానుకొండూరు మండల వార్తలు
భువనగిరి జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్, వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ను ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఆ సౌకర్యాలను అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
'మండలాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా'
ఆ సౌకర్యాలు గ్రామంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మోటకొండూరు మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వెనకబాటు అధిగమించి.. ఆదర్శ రాష్టంగా నిలిచింది: గవర్నర్