సీఎం కేసీఆర్ పేదింటి పెద్దన్నగా తన బాధ్యత తీర్చేందుకు.. కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
'పేదింటి ఆడపిల్లలకు వరం.. కల్యాణ లక్ష్మి పథకం' - kalyana laxmi cheque distribution in yadagirigutta
తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లలకు వరం లాంటిదని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
కల్యాణ లక్ష్మి పథకం
యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూర్, చొల్లేరు, దాతర్ పల్లి, కాచారం, మల్లాపూర్, మాసాయిపేట, పెద్ధకందూకూర్, సైదాపూర్, సాధువెల్లి, వంగపల్లి, రామాజిపేట, గుండ్లపల్లి, యాదగిరిపల్లి గ్రామాలకు చెందిన పలు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, తహసీల్దార్ పాల్గొన్నారు.
- ఇదీ చదవండి :దీక్షిత్ కథ సుఖాంతం.. కన్నీటి సంద్రంలో కుటుంబం