రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా సీసీఐ అధికారులు మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయించిన రైతులకు వారం రోజుల్లో వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకకుపోదన్నారు.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - cotton procurement center in aleru
ఆలేరులోని మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సీసీఐ అధికారులు పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. రైతులు సీసీఐ కేంద్రాన్ని వినియోగించుకోవాలన్నారు.
సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఈ సీసీఐ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్య, మోటకొండూర్ వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'