యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో నిర్మించిన రైతు వేదికను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వేదికపై మాట్లాడుతుండగా మండల కేంద్రానికి చెందిన ఓ రైతు... రెండో విడత గొర్రెల పంపిణీ విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
గొర్రెల పంపిణీపై ప్రశ్నించిన రైతుపై ఎమ్మెల్యే ఆగ్రహం - రాజపేటలో రైతు వేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత... ఓ రైతుపై ఆగ్రహానికి గురయ్యారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం విషయమై రైతు ప్రశ్నించడంతో... ఆయనకు రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ వేదికపై ఉన్న అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాాజపేటలో ఓ రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత... ప్రశ్నించిన వ్యక్తికి రెండో విడతలో గొర్రెలు ఇవ్వొద్దంటూ... వేదికపై ఉన్న అధికారులను ఆదేశించారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రశ్నించిన రైతును పోలీసులు, స్థానిక నాయకులు అక్కడి నుంచి బయటికి పంపి సర్ది చెప్పారు.
ఇదీ చదవండి: ఇంటింటికి కనకాంబరం తోట.. అదే వారికి ఆదాయమట
TAGGED:
telangana latest news