యాదాద్రి భువనగిరి జిల్లాలో 277 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండలం, ధర్మారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రుస్తాపూర్, గొల్లగూడెంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత
తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత
వడగండ్ల వానవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారికి ప్రభుత్వం సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలల్లో నామ్స్ ప్రకారం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయలని ప్రభుత్వ విప్ అన్నారు.
ఇదీ చూడండి:లాక్డౌన్తో పండ్ల రైతులకు కష్టాలు.. ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి