యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ కేంద్రంలో దేహదారుఢ్య పరీక్షల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్య, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు సహకారంతో కళాశాల మైదానాన్ని చదును చేసే పనులను చేపట్టారు.
పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల - police fitness tests in aleru
పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం.. ఆలేరు మున్సిపల్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ సహకారంలో కళాశాల మైదానాన్ని చదును చేయించారు.
![పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల aleru junior college ground cleaned in yadadri district for polie fitness tests](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9433463-1033-9433463-1604506799166.jpg)
పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న ఆలేరు కళాశాల
ఆలేరు కళాశాలలో పోలీస్ శిక్షణ కేంద్రం రావడాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజన్న తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదవిన 18 నుంచి 33 ఏళ్ల విద్యార్థినీవిద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
- ఇదీ చదవండి:రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు