తెలంగాణ

telangana

ETV Bharat / state

'జూడాల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి' - congress support to junior doctors strike

రాష్ట్రంలో 3500 మంది జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత బీర్ల ఐలయ్య అన్నారు. జూడాల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. వారికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

aleru constituency congress, junior doctors strike
ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్, తెలంగాణలో జూడాల సమ్మె, జూనియర్ డాక్టర్ల సమ్మె

By

Published : May 27, 2021, 5:11 PM IST

జూనియర్ డాక్టర్లు నోటీసులు ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నేత బీర్ల ఐలయ్య అన్నారు. జూడాల సమస్యను, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందజేయాలని.. గతేడాది వీరికి ఇచ్చిన 10 శాతం ఇంప్రూమెంట్ అమలు కాలేదని తెలిపారు.

కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వారి డిమాండ్లు నెరవేర్చడం ప్రభుత్వ కర్తవ్యమని ఐలయ్య అన్నారు. వారం రోజుల్లోగా రాష్ట్రానికి ఆరోగ్య మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details