తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడుతున్నారు' - illegal constructions in yadadri

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అయిలయ్య.. యాదగిరిగుట్టలోని నల్ల చెరువు సమీపంలో జరుగుతోన్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాంట్రాక్టర్, మున్సిపల్ ఆఫీసర్లు కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

drainage works in Yadagirigutta
drainage works in Yadagirigutta

By

Published : Jun 13, 2021, 12:06 PM IST

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో.. అభివృద్ధి పేరుతో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అయిలయ్య ఆరోపించారు. రూ.5.70 కోట్ల వ్యయంతో నల్ల చెరువు సమీపంలో జరుగుతోన్న డ్రైనేజీ పనుల్లో కాంట్రాక్టర్, మున్సిపల్ ఆఫీసర్లు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

33 ఫీట్ల వెడల్పుతో చేయాల్సిన పనులను.. కొన్ని చోట్ల 20 ఫీట్లు, మరో చోట 25 ఫీట్లకు కుదించడంపై అయిలయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ఇళ్లు ఉన్న చోట వెడల్పును తగ్గించి..పేదవారి ప్రాంతాల్లో పెంచుతూ ఇళ్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న డ్రైనేజీ పనులపై ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఇదీ చదవండి:Bear : ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో జనం

ABOUT THE AUTHOR

...view details