తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలేరు పోలీసుల ఔదార్యం... మతిస్తిమితం లేని వృద్ధురాలికి సాయం

మతిస్తిమితంలేని ఓ వృద్ధురాలిని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆలేరు పోలీసులు. తొమ్మిది నెలల చికిత్స అనంతరం కోలుకున్న ఆమెను అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్పించారు.

మతిస్తిమితం లేని వృద్ధురాలి పట్ల ఆలేరు పోలీసుల ఔదార్యం
మతిస్తిమితం లేని వృద్ధురాలి పట్ల ఆలేరు పోలీసుల ఔదార్యం

By

Published : Jan 24, 2021, 9:22 AM IST

Updated : Jan 24, 2021, 2:52 PM IST

మతిస్తిమితం లేని ఓ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించి... కోలుకున్న తర్వాత అనాథ ఆశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆలేరు పోలీసులు. లాక్​డౌ​న్​కు ముందు భువనగిరి జిల్లా బహదూర్​పేట గ్రామంలో మతిస్తిమితం లేక తిరుగుతున్న ఓ వృద్ధురాలి గురించి సమాచారం అందుకున్న పోలీసులు... ఆమెను ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో చేర్పించారు. తొమ్మిదినెలల చికిత్స అనంతరం కోలుకున్న ఆమెను తీసుకొచ్చి నాలుగు జతల దుస్తులు అందజేసి అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో చేర్పించారు.

తమిళనాడులోని చెన్నై దిండివనం ప్రాంతానికి చెందిన మీనాక్షి ఏడాదికాలంగా ఆలేరు ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. ఆమె పరిస్థితి తెలుసుకుని ఆస్పత్రిలో చేర్పించాము. ప్రస్తుతం ఆమెకు నయం అయింది. సంబంధికులు వచ్చి ఆమెను తీసుకెళ్లవచ్చు -రమేష్, ఎస్సై.

ఇదీ చూడండి:ప్రతిభకు పట్టం: కుర్రకారు.. ఆరంకెల హుషారు

Last Updated : Jan 24, 2021, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details