యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే యాదగిరి గుట్ట మండల పరిధిలోని సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ద్వారా గ్రామాలకు వచ్చే జలాలను చెరువులు, కాల్వలకు ఎలా మళ్లించాలి? కాళేశ్వరం జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి తెచ్చిన కాళేశ్వరం జలాలను చుక్క కూడా వృధా కాకుండా వాడుకోవాలని తెలిపారు.
కాళేశ్వరం జలాల వినియోగంపై అవగాహన సదస్సు - ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా వచ్చే జలాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆమె సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు డిజిటల్ స్క్రీన్ ద్వారా అవగాహన కల్పించారు.

కాళేశ్వరం జలాల వినియోగంపై అవగాహన సదస్సు