బునాదిగాని కాలువ నీటి పంపకాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అవగాహన కల్పించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి నీటి పంపకాల గురించి వివరించారు.
నీటి పంపకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత బునాదిగాని కాలువ నీటి పంపకాలపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.

నీటి పంపకాలపై ఎమ్మెల్యే ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టులో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని బీడు భూములకు సాగునీరు అందించనున్నామని, బునాదిగాని కాలువ ఇందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కాలువ ద్వారా భవిష్యత్తులో ఆత్మకూరు మండలంలోని చెరువులు, కుంటలు నిండి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
ఇదీచూడండి :40 మంది విద్యార్థులపై కత్తితో దాడి