యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో మద్యం సేవించి ఓ వ్యక్తి కారుతో హల్చల్ చేశాడు. సర్వీస్ రోడ్ పై మారుతి సెలెరియో కారుమద్యం మత్తులో నడిపి ఐదు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, ఒకరి తలకు తీవ్ర గాయమైంది. కారు నడిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్
ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఐదు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్