యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామి వారి శ్రీరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీరామ అవతారంలో యాదాద్రీశుడి దర్శనం - adhyayanostavalu in yadadri temple
యాదాద్రీశుడి సన్నిధిలో మూడో రోజు అధ్యయనోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. శ్రీరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
![శ్రీరామ అవతారంలో యాదాద్రీశుడి దర్శనం Yadadri Lakshminarasimha Swamy Temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10024495-297-10024495-1609063125848.jpg)
శ్రీరామ అవతారంలో కనువిందు చేసిన యాదాద్రీశుడు
బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 25న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 30న ముగియనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా అధ్యయనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని, లోకకల్యాణం కోసం విష్ణుమూర్తి రామావతారం ఎత్తారని ఆలయ ప్రధానార్చకులు వివరించారు.
- ఇదీ చూడండి :యాదాద్రికి భక్తులు... వైభవంగా అధ్యయనోత్సవాలు