యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నేడు యాదాద్రీశుడు వటపత్రశాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
వటపత్రశాయి అలంకరణలో యాదాద్రీశుడు - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.

వటపత్రశాయి అవతారంలో యాదాద్రీశుడు
వటపత్రశాయి అవతారంలో యాదాద్రీశుడు
మేళతాళాలు, మంగళవాద్యాలు, వేదపండితుల దివ్యవప్రబంధ పారాయణల మధ్య వటపత్రశాయి అలకరణలో ఉన్న స్వామి వారిని బాలాలయంలో ఊరేగించారు. అనంతరం వటపత్రశాయి అవతార విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఈనెల 6న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు.. రేపటితో ముగియనున్నాయి.