యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పర్యటించారు. మండలంలోని చౌక్ల తండా, పెద్ద తండా, రాంపూర్ తండా గ్రామాల్లోని పల్లె ప్రగతి పనులు, వైకుంఠదామాలు, నర్సరీలతో పాటు.. పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ షెడ్లను పరిశీలించారు.
తుర్కపల్లి మండలంలో అదనపు కలెక్టర్ పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన - yadadri additional collector latest news
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ పర్యటించారు. పలు గ్రామాల్లో నిర్మాణమవుతున్న వైకుంఠదామాలు, డంపింగ్ యార్డ్‌లతో సహా పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
తుర్కపల్లి లో అదనపు కలెక్టర్ పర్యటన
వైకుంఠ దామం పనులు వారంలోపు పూర్తి చేయాలని.. నర్సరీలకు, పల్లె ప్రకృతి వనాలలోని మొక్కలకు వేసవిలో క్రమం తప్పకుండా నీరు అందించాలని ఆదేశించారు. నర్సరీకి షెడ్ నెట్ వేయించాలని.. మొలకెత్తని విత్తనాలు ఉన్న బ్యాగులలో మరలా విత్తనాలు నాటాలని సూచించారు.
ఇదీ చదవండి:బీజాపుర్‌లో ఎన్కౌంటర్- జవాను మృతి