యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పట్టణ ప్రగతి రెండో రోజు కార్యక్రమం పని తీరును జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ పరిశీలించారు. పట్టణ వీధుల్లో తిరిగారు. అంతటా పారిశుద్ధ్య లోపం ఉందని, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పట్టణ ప్రగతి పనులపై అదనపు కలెక్టర్ ఆగ్రహం - యాదాద్రి భువనగిరి జిల్లా నేటి వార్తలు
పట్టణ ప్రగతి రెండోరోజు జరుగుతున్న పనులపై యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో పారిశుద్ధ్య లోపం ఉందని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పట్టణ ప్రగతి పనులపై అదనపు కలెక్టర్ ఆగ్రహం
తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పద్మశాలి కాలనీలో జేసీబీ సాయంతో చెత్త, మట్టి దిబ్బలను దగ్గరుండి తొలగించేశారు. నిరుపయోగంగా ఉన్న చేతి బోరు ప్రమాదకరంగా ఉందని, తక్షణమే దానిని మూసివేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చూడండి :'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'