శుభకార్యానికి వెళ్లి వస్తుండగా - RANGAREDDY
తల్లికొడుకులు శుభకార్యానికై వెళ్లారు. అంతా శుభమే జరుగుతుందనుకున్నారు. కానీ... వారిని కారు రూపంలో మృత్యువు పలకరించింది. ఇంటికి చేరకముందే... మృత్యు ఒడిలోకి వెళ్లారు.

ప్రమాదంలో తల్లికొడుకులు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా జిట్టాపురానికి చెందిన యాదగిరి, తల్లితోపాటు మునుగోడులో శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా... ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లికొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరణవార్త విని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాదంలో తల్లికొడుకులు మృతి
Last Updated : Feb 17, 2019, 7:39 AM IST