తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri: వలయ రహదారి నిర్మాణం పనులు వేగవంతం - తెలంగాణ వార్తలు

యాదాద్రిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వలయ రహదారి(ring road) పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 47 మీటర్ల వెడల్పుతో వలయ రహదారి నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

yadadri
yadadri

By

Published : May 27, 2021, 10:49 PM IST


యాదాద్రి (Yadadri) ప్రధానాలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న వలయ రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద రోడ్డు పనులు చేపడుతున్నారు. మొత్తంగా 47 మీటర్ల వెడల్పుతో వలయ రహదారి(ring road) నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 25 మీటర్ల విస్తీర్ణంలో అందంగా.. ఆహ్లాద పరిచే పచ్చదనం ఏర్పాటు చేస్తామన్నారు భూసేకరణలో భాగంగా భవనాల కూల్చివేత జరుగుతుండగా, మరోపక్క రోడ్డు నిర్మాణానికి మట్టిపోసి చదును చేసే పనులు చేపడుతున్నారు.

యాదాద్రి వలయ రహదారికి రక్షణ గోడ…

యాదాద్రి (Yadadri) వలయ రహదారి పనులు చకచక సాగుతున్నాయి. భూసేకరణలో తీసుకున్న భవనాల కూల్చివేతలు, మరోపక్క రహదారి ఆకృతికి సర్వేలు, ఇంకోవైపు రహదారి, రక్షణ గోడ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 4.5 అడుగుల విస్తీర్ణంతో రహదారి మధ్య ఏర్పాటు చేయనున్న విభాగిని కోసం కొలతలు వేశారు. జనం రద్దీ లేని లాక్ డౌన్ సమయంలోనే పనులు వేగిరం చేయడానికి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ పనులు చేయిస్తున్నారు. కాగా భవనాల కూల్చివేతల వద్ద ఇనుప చువ్వలు సేకరించడానికి జనాలు పోటీ పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details