తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి - acb

విద్యుత్​ కనెక్షన్​ కోసం లంచం డిమాండ్​ చేసిన గుండాల విద్యుత్​ ఏఈని అవినీతి నిరోధక శాఖ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ టోల్​గేట్​ వద్ద వలపన్ని పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ

By

Published : Jun 11, 2019, 11:48 PM IST

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వటం కోసం లంచం డిమాండ్ చేసిన గుండాల ఇన్​ఛార్జి విద్యుత్ ఏఈని నల్గొండ అవినీతి నిరోధక శాఖ అధికారులు బీబీనగర్ టోల్ గేట్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైద్రాబాద్ ఫీర్జాదిగూడకు చెందిన లక్ష్మా రెడ్డి అలియాస్ చిరస్మరన్ రెడ్డి అనే రైతు యాదాద్రి భువనగిరిజిల్లా గుండాల మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి, గోశాల ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దానికి విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ ఏఈ లక్ష్మణ్ ప్రతాప్​ను సంప్రదించారు. విద్యుత్ కనెక్షన్ కోసం రూ.15వేలు డిమాండ్ చేయగా, రూ. 6 వేలకు ఒప్పందం కుదిరింది. ఆ మేరకు రైతు లక్ష్మా రెడ్డి బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద విద్యుత్ అధికారి లక్ష్మణ్ ప్రతాప్​కు లంచం ఇస్తుండగా నల్గొండ, మహబూబ్ నగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సంయుక్తంగా నల్గొండ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం వలపన్ని పట్టుకున్నారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ

ABOUT THE AUTHOR

...view details