యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు మొదలైన ఆకస్మిక దాడులు, ఇవాళ సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో అవకతవకలను గుర్తించామన్న అధికారులు, దళారీ వ్యవస్థ విచ్చలవిడిగా నడుస్తోందని నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న భూ యాజమానులకు ఇవ్వాల్సిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అక్రమంగా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర నిల్వ ఉంచగా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీబీ అధికారులు. అనుమతులు లేని డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాలపై చర్యలు తీసుకుంటామన్నారు.
'సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు' - YADAGIRIGUTTA
యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్లు గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
!['సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3438379-thumbnail-3x2-acb.jpg)
సోదాల్లో విలువైన డాక్యుమెంట్లు గుర్తించాం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు
ఇవీ చూడండి : విద్యుదాఘాతంతో ఒప్పంద కార్మికుడి మృతి