యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. వేతనాలు రూ.10,000లకు పెంచాలని, ఇన్సెంటివ్స్ రూ. 5000 అందించాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి, ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లలిత పాల్గొన్నారు.
ప్రాణాలు ఫణంగా పెట్టి కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కూడా ఆశా వర్కర్లు సేవలందిస్తున్నారని, కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ రమేష్‌కు వినతి పత్రం సమర్పించి తన ఇబ్బందులు చెప్పుకొన్నారు. రాత్రనకా, పగలనకా పనిచేస్తున్న ఆశా వర్కర్లను నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించాలని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత డిమాండ్ చేశారు.