పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలు ఒక వరమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని తహశీల్దార్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీముబారక్ చెక్కులను ఆమె అందజేశారు.
పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లు వరాలు - ఆలేరులో చెక్కుల పంపిణి
రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలేరు మండల పరిథిలోని పలు గ్రామాల్లోని అర్హులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను సీఎం ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం కిస్మస్ సందర్భంగా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతోన్న దుస్తులు పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్‌తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ సస్పెండ్