తెలంగాణ

telangana

ETV Bharat / state

Karra Samu: కర్రసాము నైపుణ్యంతో వీక్షకుల కనురెప్పలు వాల్చకుండా చేస్తున్న యువతి - yadadri bhuvanagiri district

భువనగిరి జిల్లా అడ్డగుడూరు విద్యార్థిని తన కర్రసాము నైపుణ్యంతో అబ్బురపరుస్తుంది. వేగంగా కర్ర తిప్పుతూ వీక్షకులు కనురెప్ప వాల్చకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు తమ ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకోవాలని అంటోంది.

karra samu
Karra Samu

By

Published : Oct 5, 2021, 11:49 AM IST

కర్రసాములో ప్రతిభ కనపరుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు విద్యార్థిని

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు విద్యార్థిని కక్కిరేణి సాత్విక కర్రసాములో ప్రతిభ కనపరుస్తుంది. కబడ్డీ, వాలిబాల్ ఆటల్లో సైతం అబ్బురపరుస్తూ... పలువురి ప్రశంసలు అందుకుంటుంది. సాత్వికది మధ్యతరగతి కుటుంబం. తండ్రి కక్కిరేణి రమేశ్ అంగవైకల్యం చెందడంతో తల్లి రాణి చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని భరిస్తూ సాత్వికను ఆటల్లో ప్రోత్సహిస్తుంది.

తల్లి నమ్మకాన్ని నిలబెడుతూ సాత్విక ప్రతి ఆటలపోటీల్లో తన ప్రతిభను కనబరుస్తుంది. బీసీ సంక్షేమ శాఖ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన కబడ్డీ వాలిబాల్ ఆటల్లో పాల్గొని తన ప్రత్యేక ప్రతిభను కనపరిచి గుర్తింపును తెచ్చుకుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉపాధ్యాయుడు మోత్కూరు యాదయ్య ప్రోత్సాహంతో తొర్రూరులో జరిగిన షూటింగ్ బాల్ ఆటలో ప్రథమస్థానంలో నిలిచింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేతులమీదుగా బంగారు పథకం అందుకుంది.

అనంతరం ఉత్తర ప్రదేశ్​లోని ఘజియాబాద్​లో జరిగిన జాతీయ పోటీల్లో ఆడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తరువాత అక్బర్‌ మాస్టర్ వద్ద కర్రసాము శిక్షణ పొంది మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించి నేషనల్​కు ఎంపికయ్యింది. వచ్చే నెలలో తమిళనాడులోని చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆడుతుండడం సంతోషంగా ఉందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు తమ ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకోవాలని సూచించింది.

నాకు మా పాఠశాల ఉపాధ్యాయలు ఆటలపోటీల్లో చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. బీసీ సంక్షేమ శాఖ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సమయంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన కబడ్డీ వాలిబాల్ ఆటల్లో పాల్గొని ఇంటర్​ సొసైటీకి అర్హత పొందాను. మళ్లీ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మోత్కూరు యాదయ్య మాస్టర్ ప్రోత్సాహంతో తొర్రూరులో షూటింగ్ బాల్ ఆటలో ప్రథమస్థానంలో నిలిచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చేతులమీదుగా బంగారు పథకం అందుకున్నాను. తరువాత అక్బర్‌ మాస్టర్ వద్ద కర్రసాము శిక్షణ పొంది మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన పోటీల్లో బంగారు పథకం సాధించి నేషనల్​కు ఎంపికయ్యాను. వచ్చే నెలలో తమిళనాడులోని చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనబోతున్నాను. -సాత్విక

ఇదీ చదవండి:Sexual Harassment on a Minor Girl : ఏడేళ్ల బాలికపై బాలుడి అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details