తెలంగాణ

telangana

ETV Bharat / state

'సినీ నిర్మాతతో ప్రాణహాని ఉంది.. నాకు రక్షణ కల్పించండి' - యాదాద్రి భువనగిరి యువకుడు

సినీ నిర్మాత, రాజకీయ నాయకుడితో తనకు ప్రాణహాని ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరికి చెందిన బొజ్జా భానుచందర్ అనే యువకుడు ఆరోపించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. హైదరాబాద్​లోని హైదర్​గూడలో మీడియాతో మాట్లాడారు.

A young man from Yadadri Bhubaneswar district
రక్షణ కల్పించాలని కోరుతున్న బొజ్జా భానుచందర్

By

Published : Mar 6, 2022, 7:44 PM IST

కూకట్​పల్లికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టెముక్కల పద్మారావుతో తనకు ప్రాణహాని ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరికి చెందిన బొజ్జా భానుచందర్ అనే యువకుడు ఆరోపించారు. సదాశివపేట్ అనంతసాగర్ తండాలో ఉన్న పద్మారావు ఫార్మ్​హౌస్​లో జరుగుతున్న అరాచకాలపై మానవహక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశానని తనపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. తన అన్నను బెదిరించడమే కాకుండా తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సుదర్శన్ అనే రౌడీ షీటర్​ను తన ఇంటికి పంపి కుటుంబ సభ్యులను సైతం బెదిరింపులకు గురి చేస్తున్నాడని భానుచందర్ వాపోయారు. గొట్టెముక్కల పద్మారావుపై గతంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

'సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు గొట్టెముక్కల పద్మారావు సదాశివపేట్​లోని అనంతసాగర్​ తండాలో ఇద్దరు వ్యక్తులను కొట్టాడు. నేను సామాజిక బాధ్యతగా మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశా. అందువల్ల నాపై కక్ష పెంచుకుని మా అన్నను బెదిరించాడు. నాపైనేే కేసు పెడతాడా? మీ అంతు చూస్తా అని బెదిరించాడు. ప్రాణభయంతో నేను భువనగిరి పీఎస్​లో ఫిర్యాదు చేశా. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన కుటుంబంలో గొడవలకు నేనే కారణమని ఆరోపిస్తూ నన్ను చంపేస్తానని బెదిరించాడు. సామాన్య వ్యక్తినైనా నాకు అతనితో ప్రాణహాని ఉంది. పోలీసులు నాకు రక్షణ కల్పించి పద్మారావుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. - బొజ్జా భానుచందర్​, బాధిత యువకుడు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details