యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెంలో దారుణం జరిగింది. గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు బిహార్ రాష్ట్రానికి చెందిన సంగీత కుమారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ మెడ, మొహంమీద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ కలహాలతో మృతురాలి భర్త ఆశిష్ హత్య చేసి... మూడేళ్ల కుమార్తెను తీసుకుని పరారై ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చౌటుప్పల్లో వివాహిత దారుణ హత్య - women murder in chowtuppal yadadri bhuvanagiri district
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని లింగోజిగూడెంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తే హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
చౌటుప్పల్లో వివాహిత దారుణ హత్య