తెలంగాణ

telangana

ETV Bharat / state

woman living in woodshed: విధి వక్రించింది.. చెక్కడబ్బానే వారికి ఆవాసమైంది.. ఇద్దరమ్మాయిలతో...

జీవితం చాలా పెద్దది. ఎవరికైనా కష్టాలు సహజం. కానీ ఆమె కష్టాలు చెప్పుకోలేనివి. భర్త మరణించటంతో తన ఇద్దరు పిల్లలతో ఆమె రోడ్డుపై పడింది. పుట్టింటి వారి స్థోమత అంతంతమాత్రమే కావడంతో చెక్క డబ్బాలో జీవనం సాగిస్తోంది. కుటుంబపోషణ భారం కావటంతో కూలీ పని చేసుకుంటూ పిల్లలను సాకుతూవస్తోంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చెక్క డబ్బాలో కాలం వెళ్లదీస్తున్న ఓ మహిళ ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తోంది.

woman living in a woodshed
woman living in a woodshed

By

Published : Nov 9, 2021, 10:17 PM IST

Updated : Nov 10, 2021, 6:30 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన దాసరి ఎలిశమ్మ, ముత్తయ్యలది నిరుపేద కుటుంబం. వారి కూతురు జయమ్మకు 16 ఏళ్ల క్రితం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కామంచి జాన్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో జాన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు పిల్లలతో జయమ్మ రోడ్డుపై పడింది. నెల్లూరులో సొంత ఇల్లు లేకపోవటంతో జయమ్మ తన పుట్టింటికి వచ్చింది. జయమ్మ తల్లిదండ్రులకు కూడా జీవనాధారం లేకపోవటంతో వారి స్థలంలోనే చిన్న చెక్క డబ్బాలో ఇద్దరు పిల్లలతో కలిసి జయమ్మ కాలం వెల్లదీస్తోంది. ఆ చెక్క డబ్బా కూడా ఎండలకు,వర్షాలకు పూర్తిగా పాడైపోవడంతో... వర్షం పడితే అక్కడే ఉన్న చర్చిలో తలదాచుకుంటారు.

ఇల్లు లేక ఇద్దరు అమ్మాయిలతో ఇబ్బంది పడుతున్నాని జయమ్మ తెలిపింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం లేదని పేర్కొంది. భర్త చనిపోయి మూడేళ్లైనా ఆసరా పెన్షన్ అందడం లేదని వాపోయింది. కనీసం రేషన్ కార్డు కూడా లేదని తెలిపింది. ప్రభుత్వ సాయం కోసం స్థానిక ఎమ్మెల్యేను సైతం ఆశ్రయించాని పేర్కొంది. అయినప్పటికీ ఎలాంటి సాయం అందలేదని జయమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గూడు కోసం నివసిస్తున్న చెక్క డబ్బా కూడా ఎండలకు,వర్షాలకు పూర్తిగా పాడైందని తెలిపింది. వర్షం పడితే అక్కడే ఉన్న చర్చిలో వాన తగ్గేవరకు తలదాచుకుంటున్నామని పేర్కొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైనా ప్రభుత్వసాయం అందించాలని కోరింది.

నాకు పెళ్లై 17ఏళ్లు అవుతుంది. నా భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. మా అత్తగారిది నెల్లూరు. భర్త చనిపోయాక నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను. ఇక్కడ వారికి కూడా ఇల్లు లేదు. వారి స్థలంలోనే చిన్న చెక్క డబ్బాలో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నా. ఆ చెక్క డబ్బా కూడా ఎండలకు,వర్షాలకు పూర్తిగా పాడైంది. వర్షం పడితే అక్కడే ఉన్న చర్చిలో తలదాచుకుంటాను. పిల్లల పోషణ కోసం కూలీ పని చేసుకుంటూ మిషన్‌ కుడతాను. ప్రభుత్వం మాకు ఏదైన సాయం చేయాలనికోరుతున్నాను.-జయమ్మ

విధి వక్రించింది.. చెక్కడబ్బానే వారికి ఆవాసమైంది.. ఇద్దరమ్మాయిలతో...

ఇదీ చదవండి:Agri Horticulture Society: మిద్దెసాగు చేయాలనుకుంటున్నారా? అయితే ఇక్కడికి ఓసారి వెళ్లాల్సిందే!

Last Updated : Nov 10, 2021, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details