యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలోకి పాము వచ్చింది. పామును గుర్తించిన పిల్లలు భయంతో కేకలు పెట్టారు. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో కొట్టి చంపారు.
బడిలో నాగుపాము..విద్యార్థుల పరుగులు.. - a snake entered in to the primary school rajapet mandal
రాజపేట మండలం దూది వెంకటాపురంలోని ప్రాథమిక పాఠశాలలోకి పాము వచ్చింది. పిల్లలు హడలిపోయారు. గుర్తించిన స్థానికులు పామును కొట్టి చంపారు.
బడిలో నాగుపాము..విద్యార్థుల పరుగులు..
పాఠశాల ఆవరణ మొత్తం చెత్తా, చెదారంతో పేరుకుపోయిందని... పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల పాములు ప్రవేశిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక నాయకులు పట్టించుకుని పాఠశాల ఆవరణను శుభ్రం చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: అమరావతిలో బాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి