తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి - A Man Suicide in Yadadri Bhuvanghiri district

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో పాతబడిన భవనంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

By

Published : Aug 13, 2019, 12:02 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు భిక్షపతిగా గుర్తించారు. మృతుడు కారు డ్రైవర్​గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. రెడ్లరేపాక భిక్షపతి అత్తగారి ఊరని తెలుస్తోంది. అదే గ్రామంలో అతనికి 15 ఎకరాల పొలం ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అత్తగారి పొలంలోని పాతబడిన భవనంలో అనుమానాస్పదంగా ఉరి వేసుకొని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details