తెలంగాణ

telangana

ETV Bharat / state

'కల్తీ బీర్లు సేవించిన యువకుడికి వాంతులు' - ALERUTOWN

బీర్లు తాగి అస్వస్థకు గురైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం దుకాణం నుంచి బీర్లు ఇంటికి తీసుకెళ్లి తాగితే ఆస్పత్రి పాలయ్యాడు.

బీర్లు తాగి అస్వస్థకు గురైన ఓ వ్యక్తి

By

Published : May 26, 2019, 6:53 PM IST

Updated : May 26, 2019, 7:12 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన ఓ యువకుడు మద్యం షాపులో ఆరు కింగ్ ఫిషర్ బీర్లు కొనుగోలు చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి రెండు బీర్లు సేవించాడు. కొంత సమయం తర్వాత అతడికి వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలో అతను తాగినవి కల్తీ బీర్లు అని వైద్యులు ధృవీకరించారు. సేవించిన బీర్లు పూర్తిగా చెత్తా చెదారంతో నిండి ఉన్నాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రెండు కల్తీ బీర్లు తాగి అస్వస్థతకు గురైన వ్యక్తి
'కల్తీ బీర్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి' కల్తీకి సరకు పంపిణీ చేస్తున్న కింగ్ ఫిషర్ యాజమాన్యంపై, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరాడు. ఇవీ చూడండి : డబ్బులు వసూలు చేసి... టికెట్లు ఇవ్వట్లేదు
Last Updated : May 26, 2019, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details