తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి - CRIME NEWS IN YADADRI

సరదాగా చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. తాను చెరువులో మునిగిపోయి.... కుటుంబసభ్యులను శోక సంద్రంలో ముంచేశాడు. ఈ దుర్ఘటన యాదాద్రి జిల్లా తిర్మాలాపూర్​లో జరిగింది.

A MAN DIED IN FISH HUNTING AT THIRMALAPUR THANDA
A MAN DIED IN FISH HUNTING AT THIRMALAPUR THANDA

By

Published : Mar 2, 2020, 10:24 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. బొల్లా ఉప్పలయ్య అనే వ్యక్తి గ్రామ చెరువులో చేపలు పట్టేందుకువెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోయాడు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల చెరువులోనే మునిగిపోయాడు. అక్కడున్న స్థానికులు అతన్ని కాపాడే యత్నం చేసినా ఫలితం కనిపించలేదు.

పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్ల సహాయంతో ఉప్పలయ్య మృతదేహాన్ని బయటికి తీశారు. కేసు నమోదు చేసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉప్పలయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details