Portrait of India on a Handloom Saree: స్వాతంత్య్ర పోరాటానికి, చేనేతకు అవినాభావ సంబంధం ఉంది. నాడు మహాత్మాగాంధీ రాట్నం తిప్పారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలు మేలని చాటిచెప్పారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో జాతి మొత్తం ఆజాదీకా అమృత్ మహోత్సవం జరుపుకొంటోంది. ఆ వేడుక నేపథ్యంలో.. ఒకే వస్త్రంపై 10 వేల వర్ణాలు, భారతదేశ చిత్రపటాన్ని డబుల్ ఇక్కత్‌లో నేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణానికి చెందిన భోగ బాలయ్య. 15 నెలలు కష్టపడి నిలువు, పేక (అడ్డం) కలుపుతూ దేశ చిత్రపటం ఆకృతి వచ్చేలా వస్త్రం రూపొందించారు.
జాతీయ భావం రేకెత్తించేలా..
ఈయన గతంలో 1,200 రంగులున్న చీరను నేశారు. ఒకే వస్త్రాన్ని 121 రంగులు, 121 డిజైన్లతో తీర్చిదిద్దారు. తన ప్రతిభకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 2021 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారంతో గౌరవించింది. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ భావం రేకెత్తించేలా చుట్టూ రంగులు.. మధ్యలో భారతదేశ చిత్రపటం, రాట్నం చరఖా కనిపించేలా వస్త్రాన్ని రూపొందించినట్లు బాలయ్య తెలిపారు. నిలువు వంద చిటికీలు, పేక(అడ్డం) వంద చిటికీలు కలపడం వల్ల 10 వేల వర్ణాలతో వస్త్రం తయారైనట్లు చెప్పారు. ప్రభుత్వం తమ లాంటి చేనేత కళాకారులను ప్రోత్సహిస్తే చాలా ఈ వృత్తిలో రాణిస్తారని కోరారు.
కొత్తగా ఏదైనా చేయాలనే తపనతో..