యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి.. కాకపోతే పార్కింగ్ ఫీజు రూ. 500! - Yadadri Temple Updates
19:09 April 30
అనుమతించిన వాహనాలకు ప్రవేశ రుసుం
Yadadri Parking Fee: యాదాద్రి కొండపైకి అనుమతించే వాహనాలకు పార్కింగ్ రుసుం వసూల్ చేయనున్నారు. కొండపైకి అనుమతించే వాహనాలకు గంటకు రూ.500 రుసుం విధించనున్నారు. గంట సమయం తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రోటోకాల్, దాతల వాహనాలకు ప్రవేశ రుసుం నుంచి మినహాయింపు ఇచ్చారు. రేపట్నుంచే వాహనాలకు నిర్ణయించిన ప్రవేశ రుసుం అమలు అవుతాయని ఆలయ ఈవో గీత తెలిపారు.
ఇదిలా ఉండగా... యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలపై యాదాద్రి దేవస్థానం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి ఇదివరకే వెల్లడించారు. కేవలం ఆర్టీసీ బస్సుల ద్వారా కొండపైకి భక్తుల తరలించనున్నట్లు తెలిపారు. భక్తుల తరలింపునకు అయ్యే వ్యయం ఆలయమే భరిస్తుందని ఈవో చెప్పారు. అయితే తాజా నిర్ణయంతో వాహనాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇవీ చూడండి: