యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్కు చెందిన జెట్ట నర్సమ్మకు సంతానం లేకపోవడంతో.. ఆమె భర్త శ్రీశైలం కోమలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారిరువురికి ఓ పాప పుట్టిన కొద్ది సంవత్సరాలకే.. కోమలమ్మ అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి నర్సమ్మ ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చింది. రెండేళ్ల క్రితం భర్త శ్రీశైలం కూడా మృతి చెందాడు. దీంతో అనారోగ్యంతో మంచాన పడ్డ నర్సమ్మ నేడు ప్రాణాలు విడిచింది.
తల్లికి తల కొరివి పెట్టి.. అనాథగా మిగిలి..! - తల్లిని కోల్పోయిన చిన్నారి
కడుపున పుట్టకపోయిన అల్లారు ముద్దుగా పెంచిన తల్లికి.. ఓ కూతురు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

girl conducted funeral to her mother
తండ్రి, ఇద్దరు తల్లులు మరణించడంతో చిన్నారి అర్చన అనాథగా మారింది. తల కొరివి పెట్టేందుకు ఎవరు లేక తానే అంతిమ సంస్కారాలు నిర్వహించింది. అందరినీ కోల్పోయి, తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన చిన్నారిని చూసి.. స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం అర్చన స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.
ఇదీ చదవండి:ఐసోలేషన్లో రెండు రోజుల్లో ఏడుగురు మృతి