తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడికి విరాళంగా బంగారు పుష్పాలు

హైదరాబాద్​కు చెందిన ఓ ఇద్దరు భక్తులు.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భారీ విరాళం ఇచ్చారు. 10 బంగారు పుష్పాలను ఆలయ అధికారులకు అందజేసి తమ భక్తిని చాటుకున్నారు.

yadadri updates
yadadri updates

By

Published : May 5, 2021, 8:44 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీ విరాళం వచ్చి చేరింది. హైదరాబాద్​కు చెందిన జగదీశ్​, నారాయణరెడ్డి అనే ఇద్దరు భక్తులు.. రూ.5 లక్షల విలువగల 10 బంగారు( 91 గ్రాములు) పుష్పాలను ఆలయ అధికారులకు అందజేశారు. సతీ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి సేవలో ఎమ్మెల్సీ..

ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య దంపతులు నేడు యాదాద్రికి విచ్చేశారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకున్నారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి:రానున్న రెండు రోజులు వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details