యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధులో ఊరేగుతూ ధగధగ మెరిసిపోయారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం.. 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరగనుంది.
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు - 9day bramosthavalu in Yadadri
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో రథోత్సవం.. 8 గంటలకు కొండ కింద స్వామివారి ప్రచార రథం ఊరేగింపు వైభవంగా జరగనుంది.
వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు.