ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులవిందుగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజున స్వామివారు సింహవాహనంపై... యోగానంద నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
సింహవాహనంపై యోగానందునిగా యాదాద్రీశుడు - yadagirigutta temple brahmotsavam 2020
యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రోజుకో రూపంలో స్వామివారు భక్తులకు దర్శమిస్తున్నారు. పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి నారసింహూన్ని సేవించుకుంటున్నారు.
![సింహవాహనంపై యోగానందునిగా యాదాద్రీశుడు 6TH DAY OF YADADRI BRAHMOSTHVALU](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6274517-thumbnail-3x2-pppp.jpg)
6TH DAY OF YADADRI BRAHMOSTHVALU
వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా స్వామివారిని అలంకరించారు. వేదమంత్రాలు, వేదపారాయణలు, మంగళవాద్యాల నడుమ ఊరేగింపు కొనసాగింది. స్వామి వారి సేవ సందర్భంగా భక్తులకు అర్చకులు... సింహ వాహనసేవ విశిష్టత తెలియజేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
సింహవాహనంపై యోగంనందునిగా యాదాద్రీశడు