యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారులు ఫ్యాన్సీ నెంబరు వేలంలో 'టీఎస్ 30 డీ 9999'ను రూ.5 లక్షల 10 వేలతో బోర్‌వెల్ వ్యాపారి రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఇంత ధర వెచ్చించి నెంబర్‌ను కొనుగోలు చేయటం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. రామచంద్రారెడ్డి కొత్తగా కొనుగోలు చేసిన తన కారుకు ఫ్యాన్సీ నెంబరు ఉండాలని పోటీపడి కొనుక్కున్నారు. రవాణా శాఖాధికారులు ఆన్లైన్లో ఈ నెంబరు ధరను రూ.50వేలుగా నిర్ణయించారు. ఇటీవల కొత్తగా కార్లు కొన్న యజమానులిద్దరు రూ.50 వేలు దరఖాస్తు ఫీజు చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా కోట్ చేసిన రాంచంద్రారెడ్డికి నెంబర్‌ను అధికారులు కేటాయించారు. రామచంద్రా రెడ్డి నైజీరియాలో బోర్‌వెల్ వ్యాపారం చేస్తున్నాడు.
కారు నెంబర్ కోసం ఏకంగా రూ.5 లక్షల 10 వేలు - CAR NUMBER
కొత్తగా కొన్న తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యాపారి ఏకంగా రూ.5 లక్షల 10 వేలు వెచ్చించాడు. రవాణా శాఖ అధికారులు రూ.50 వేలుగా నిర్ణయించగా... ఇద్దరు వ్యక్తులు ఆన్లైన్లో పోటీపడ్డారు. వేలం నిర్వహించగా... ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలోనే అత్యధిక ధర పలికిన నెంబర్‌గా రికార్డు నెలకొల్పింది.
5 lakh 10 thousand rupees for a car number